కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకుల బీభత్సం - దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన జోగి అనుచరులను అడ్డుకున్న స్థానికులు - YSRCP Leaders Attack - YSRCP LEADERS ATTACK

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 6:38 PM IST

YSRCP Attack TDP Leaders in Krishna District : కృష్ణాజిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు పేట్రేగిపోతున్నారు. పెనమలూరు నియోజవర్గంలోని పోరంకి, కానూరు, తాడిగడప పోలింగ్​ కేంద్రాల్లో జోగి రమేశ్​ అనుచరులు భారీగా మోహరించారు. ఇబ్రహీంపట్నం, పెడన నుంచి  దొంగ ఓట్లు వేసేందుకు జోగి అనుచరులు వస్తున్నారని ఆరోపించారు. పోరంకి, కానూరులోనూ దొంగ ఓట్లు వేసేవారిని బోడె ప్రసాద్​ అనుచరులు అడ్డుకున్నరు. అధికార నేతలు దొంగ ఓట్లు వేస్తున్నా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.

పెనమలూరు తెలుగుదేశం, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య దాడులు జరిగాయి. ఈ దాడుల్లో టీడీపీ కార్యకర్త వీర్ల రాజేశ్​కు తీవ్ర గాయాలయ్యాయి. తాడిగడప పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్​ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నేతలు ప్రలోభ పెడుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరంకి హైస్కూల్​ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బోడె ప్రసాద్​, ఆయన వర్గీయులపై జోగి రమేశ్​ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిపై లాఠీఛార్జ్​ చేసి పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు వైఎస్సార్సీపీ నేతలు వీరంగం చేశారు. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ కారుపై వైఎస్సార్సీపీ అభ్యర్థి వంశీమోహన్​ అనుచరులు దాడి చేశారు. యార్లగడ్డ వెంకట్రావు కారు అద్దాలను ధ్వంసం చేసి విధ్వంసాన్ని సృష్టించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.