గోవా నుంచి అక్రమ మద్యం - రూ.కోటి విలువైన 13 వేల బాటిళ్లు స్వాధీనం - police seized 13000 liquor bottles - POLICE SEIZED 13000 LIQUOR BOTTLES
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-08-2024/640-480-22343476-thumbnail-16x9-ysr-district-police-seized-13000-goa-liquor-bottles.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 31, 2024, 4:47 PM IST
YSR District Police Seized 13,000 Goa Liquor Bottles : వైఎస్సార్ జిల్లాలో కోటి రూపాయలు విలువ చేసే అక్రమ మద్యాన్ని జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పులివెందుల మండలం ఆర్. తుమ్మలపల్లి వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులకు గోవాకు చెందిన 13 వేల మద్యం సీసాలు పట్టుబడ్డాయి. ఈ విషయాన్ని పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ మీడియాకు వెల్లడించారు.
"జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాం. ఈ క్రమంలోనే ఆర్. తుమ్మలపల్లి వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న ఐచర్ వాహనం కనిపించింది. అలాగే దాన్ని వెంబడిస్తూ మరో స్కార్పియో వాహనం వస్తుంది. అనుమానంతో ఐచర్ వాహనాన్ని ఆపి తనిఖీలు చేపట్టాం. అందులో రూ. కోటి విలువ చేసే 13వేల మద్యం సీసాలు కనిపించాయి. వెంటనే మద్యాన్ని స్వాధీనం చేసుకొని మరో స్కార్పియో వాహనంలో అనుసరిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశాం. మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారికోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో మద్యం పట్టివేతపై ఎస్పీ సిబ్బందిని అభినందించారు" అని డీఎస్పీ మురళి నాయక్ వెల్లండిచారు.