మాజీ ఎంపీ ఉండవల్లితో షర్మిల భేటీ - ఏం చర్చించారంటే ? - Sharmila met Undavalli
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 25, 2024, 8:29 PM IST
|Updated : Jan 25, 2024, 10:11 PM IST
YS Sharmila Met Former MP Undavalli Arun Kumar: రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నివాసానికి వైఎస్ షర్మిల వెళ్లారు. సుమారు గంటసేపు అరుణ్ కుమార్తో వైఎస్ షర్మిల, ఏపీ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, గిడుగు రుద్రరాజు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ చాలా రోజుల తరువాత రాజమహేంద్రవరం వచ్చామని ఉండవల్లి అరుణ్ కుమార్తో ఆయన కుటుంబంతో భేటీ అవడం సంతోషకరంగా ఉందని షర్మిల అన్నారు.
ఉండవల్లి కుటుంబంతో మాకు సానిహిత్యం ఉందని, ఉండవల్లి అరుణ్ కుమార్తో భేటీలో రాజకీయాలకు ప్రాధాన్యత లేదని తెలిపారు. ఈ సందర్భంగా రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ రాజకీయాలు, ఎన్నికల గురించి మా మధ్య పెద్దగా చర్చ జరగలేదన్నారు. వైఎస్ షర్మిల కారణంగా ఏపీ కాంగ్రెస్ కచ్చితంగా బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. షర్మిల కారణంగా వైసీపీకి నష్టమా ? లాభమా ? అనేది ఎన్నికల ఫలితాలు మాత్రమే చెబుతాయని అన్నారు.
Sharmila Also Met Dr Dutta Ramachandra Rao: కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో వైసీపీ నేత డా దుట్టా రామచంద్రరావుతోనూ షర్మిల భేటీ అయ్యారు. ఏలూరు నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యలో హనుమాన్ జంక్షన్లో దుట్టా ఇంటికి దగ్గర షర్మిల సమావేశమయ్యారు. ప్రముఖ వైద్యుడు, వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడైన దుట్టాతో షర్మిల భేటీ రాజకీయంగా చర్చకు దారితీసింది. పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాజశేఖర్ రెడ్డి సన్నిహితులను, గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన నాయకులను కలుస్తున్నారు. దుట్టాను షర్మిల కాంగ్రెస్లోకి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.