LIVE తిరుమల పర్యటన రద్దు ప్రకటన అనంతరం జగన్ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - YS Jagan Press Meet Live - YS JAGAN PRESS MEET LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 27, 2024, 3:51 PM IST
|Updated : Sep 27, 2024, 4:59 PM IST
YS Jagan held Media Conference on Cancellation of Tirumala Tour Live : తిరుమల పర్యటన రద్దుపై జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. కొద్దిసేపటి క్రితమే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. లడ్డూ కల్తీపై వివాదం కొనసాగుతున్న వేళ తిరుమలేశుడ్ని దర్శించుకునేందుకు వెళ్తానని జగన్ ప్రకటించారు. డిక్లరేషన్‌పై సంతకం చేశాకే ఆయన కొండపైకి అడుగుపెట్టాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఇదే విషయాన్ని టీటీడీ కూడా తేల్చిచెప్పింది. డిక్లరేషన్‌పై సంతకం చేయకుండానే జగన్ శ్రీవారిని దర్శించుకుంటారని భూమన కరుణాకర్‌రెడ్డి ప్రకటించడంతో హిందూ సంఘాలు, స్వామీజీలతోపాటు విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం యావత్ ప్రపంచాన్నే ఉలిక్కి పడేలా చేసింది. కాసుల కక్కుర్తి కోసం ఆఖరికి దేవుని ప్రసాదంలోనూ అవినీతికి పాల్పడటం హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. దీనిపై కనీసం ప్రాయశ్చిత్తం లేకుండా వైఎస్సార్సీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. శనివారం ఆలయాల్లో పూజలు చేయాలంటూ వైసీపీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. తాను తిరుమల వెళ్తానని ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లు జగన్ ప్రకటించారు. ప్రస్తుతం తిరుమల పర్యటన రద్దుపై జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Sep 27, 2024, 4:59 PM IST