డబ్బు చెల్లించాల్సిందే - లేకుంటే వదలం - లోన్ యాప్​ వేధింపులకు యువకుడు బలి - CRIME NEWS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 7:44 AM IST

Youngman Suicide with Loan App Harassment: ఆన్​లైన్ రుణ యాప్ వేధింపులు భరించలేక పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఎర్రగుంట తండాకు చెందిన బాలస్వామి నాయక్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాలస్వామి నాయక్ వినుకొండలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఏడాది కిందట రుణ యాప్ ద్వారా డబ్బులు తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులను సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీ పెరిగిపోయింది. 

నగదు వెంటనే చెల్లించాలని నిర్వాహకులు ఫోన్ చేసి వేధింపులకు గురి చేశారు. ఇటీవల నలుగురు వ్యక్తులు ఇంటికి వచ్చి నగదు చెల్లించాలని, లేకుంటే వదిలేదే లేదని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో జనవరి 26వ తేదీన బాలస్వామి నాయక్ ఇంటిని నుంచి వెళ్లిపోయాడు. ఎన్నిరోజులైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని కోసం గాలించగా అడవిలో చెట్టుకు ఉరేసుకుని బాలస్వామి నాయక్ విగతజీవిగా కనిపించాడు. బాలస్వామి నాయక్ మరణించాడని తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రుణ యాప్ వేధింపుల వల్లే తమ కుమారుడు చనిపోయాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.