ఎమ్మిగనూరులో కత్తితో యువకుడి హల్చల్ - సీసాలో పెట్రోలు పోయలేదని దాడికి యత్నం - One Person Halchal with Knife - ONE PERSON HALCHAL WITH KNIFE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 31, 2024, 1:44 PM IST
Young Person Halchal With Knife in Petrol Bunk: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ఓ పెట్రోల్ బంకులో సీసాలో పెట్రోలు పోయలేదని సమీర్ అనే యువకుడు కత్తితో హల్చల్ చేశాడు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు బాటిళ్లలో పెట్రోలు పోయవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు కూడా బంకు యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో బాటిళ్లలో పెట్రోల్‌లో పోసేందుకు సిబ్బంది నిరాకరించడంతో యువకుడు వారిపై కత్తితో దాడికి యత్నించాడు.
బంకు సిబ్బంది ఎంత చెప్పినా వినకుండా వారితో మొండిగా వారిస్తూ సమీర్ సీసాలో పెట్రోలు వేయాలని అడిగాడు. అతను పెట్రోల్ పోసేందుకు నిరాకరించడంతో సమీర్ కత్తితో దాడికి యత్నించాడు. దీంతో అక్కడ ఉన్న వారు సమీర్‌ను అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంకులో పని చేసే వేరే వ్యక్తి వెంటనే సీసాలో పెట్రోలు పోశారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సమీర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు ఇంకా పూర్తి విషయాలను వెల్లడించలేదు.