అతి చిన్న వాషింగ్ మిషన్ తయారీ - తుని యువకుడు గిన్నిస్ రికార్డు
🎬 Watch Now: Feature Video
Young Man Invented Smallest Washing Mission : 37 మిల్లీ మీటర్ల పొడవు, 41 మిల్లీ మీటర్ల వెడల్పు, 43 మిల్లీ మీటర్ల ఎత్తు, 33 గ్రాముల బరువుతో అతి చిన్న వాషింగ్ మిషన్ తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన తిరుమలనీడి సాయి. పాలిటెక్నిక్ పూర్తి చేసిన సాయి గతంలో అతి చిన్న ఎయిర్ కూలర్ తయారు చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకున్నాడు.
గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాలనే లక్ష్యంతో ఇప్పడు అతి చిన్న వాషింగ్ మిషన్ తయారు చేశాడు. దీని సామర్థ్యం 5 గ్రాములు. డీసీ మోటార్, ఫోమ్ బోర్డ్, ప్లాస్టిక్ పైపు, 4 వాల్ట్స్ బ్యాటరీ, చిన్న ఎల్ఈడీ, మైక్రో స్విచ్ తదితర వాటిని ఉపయోగించి 45 నిమిషాల్లో దీన్ని సిద్ధం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందంటున్నాడు సాయి.