వైఎస్సార్సీపీకి మరో షాక్ - ఎమ్మెల్సీ పదవికి మహ్మద్ ఇక్బాల్ రాజీనామా - MLC MOHAMMED IQBAL RESIGN YCP - MLC MOHAMMED IQBAL RESIGN YCP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 5, 2024, 8:00 PM IST
YCP MLC Mohammad IQBAL Resign Letter to CM Jagan: ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ నుంచి నేతలంతా ఒక్కొక్కరుగా రాజీనామాలు చేయడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. వైసీపీ నేతలంతా అసంతృప్తితో ఒక్కొక్కరూ పార్టీని వీడుతున్నారు. తాజాగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి హిందూపురం నేత మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు రాజీనామా లేఖను పంపారు. తన రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్‌కు కూడా ఆయన పంపించారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
గురువారం వైసీపీ సభ్యత్వానికి ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా రాజీనామా చేశారు. ఈ నెల 9న ప్రజల సమక్షంలో భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ ప్రణాళిక ప్రకటిస్తానని ఆమంచి స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరులతో సమావేశాలు నిర్వహించారు. స్థానికులకు టికెట్ ఇవ్వకుండా ఎక్కడి నుంచో వచ్చిన వారికి టికెట్ ఇవ్వడమేంటని నేతలు అభిప్రాయపడ్డారు.