వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా- సరికొత్త కొత్తనాటకానికి తెరలేపిన వైఎస్సార్సీపీ - Volunteers resigned to campaign YCP - VOLUNTEERS RESIGNED TO CAMPAIGN YCP
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-03-2024/640-480-21055302-thumbnail-16x9-volunteers-campaigning.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 23, 2024, 3:47 PM IST
YCP Leaders Resigning With Volunteers in Prakasam District: ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైసీపీ నాయకులు సరికొత్త ఎత్తుగడకు తెరలేపారు. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు సమీస్తున్న వేళ వాలంటీర్లు రాజీనామా చేస్తున్నామంటూ ప్రకటించారు. తాము జగనన్న కోసం త్యాగం చేస్తున్నామని చెబుతూ ఏడుగురు వాలంటీర్లు రాజీనామా చేసేందుకు మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. రాజీనామా చేస్తున్నట్లు కమిషనర్ కిరణ్‌కు రాజీనామా పత్రాలు అందజేశారు.
కాగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో వాలంటీర్లు గానీ, ప్రభుత్వం నుంచి వేతనాలు పొందే ఉద్యోగులు రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటే చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పథకం ప్రకారం వైసీపీ నాయకులే వాలంటీర్ల చేత రాజీనామా చేయించే కార్యక్రమానికి తెరలేపారు. తర్వాత వాలంటీర్ల లాగానే ఇంటింటికి తిరిగి ఇప్పటి వరకు చేసిన పనులు వివరించి ఓట్లు వేయించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మరలా వాలంటీర్‌గా విధుల్లోకి తీసుకుంటామని వైసీపీ అభ్యర్ధి అన్నా రాంబాబు వారికి హామీ ఇచ్చినట్టు తెలిసింది.