ప్రజల సొమ్ము సొంతానికి- 'తుడా' నిధులతో వైసీపీ తాయిలాలు - Election Code violation - ELECTION CODE VIOLATION
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 20, 2024, 1:00 PM IST
YCP Leader Violate Election Code in Tirupati District : ఎన్నికల నామినేషన్ పర్వం మొదలైన అధికార నేతల తీరు మారడం లేదు. ఎన్నికల నిబంధనలు తమకు వర్తించవన్నట్లు వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఆర్వో వాటర్ ప్లాంట్ పరికరాలను పంపిణీ చేస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.
రెండు కంటైనర్లలలో వచ్చిన 10 వాటర్ ప్లాంట్ పరికరాలను టీడీపీ నేతలు అడ్డుకుని ఎన్నికల అధికారులకు అప్పగించారు. వాటి బిల్లులు, ఎక్కడ నుంచి పంపిణీ చేశారని అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన సరైన ఆధారాలు వారి దగ్గర లభించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తుడా నిధులను ఎన్నికల సందర్భంగా అధికార ప్రభుత్వం విచ్చలవిడిగా వెచ్చిస్తుందని టీడీపీ నేతలు ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు వైసీపీ ఎమ్మెల్యే చేస్తున్న కుట్రలకు అడ్డుకట్ట వేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.