పాఠశాలలో వైఎస్సార్సీపీ నాయకుడి కుమారుడి పెళ్లి - స్థానికులు ఆగ్రహం - YCP son wedding ceremony in school

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2024, 7:42 PM IST

YCP Leader Son Marriage in Karmpudi Zilla Parishad School: వైసీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, జిల్లా పరిషత్​ పాఠశాలలో వివాహాలు జరిపించడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పల్నాడు జిల్లా కారంపూడి జిల్లా పరిషత్​ పాఠశాలలో ఓ వైసీపీ నాయకుడి కుమారుడి వివాహం చేయడం చర్చనీయాంశంగా మారింది. 

పిల్లలు చదువుకునే ప్రాంతంలో ఎటువంటి అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించకూడదు. కానీ వైఎస్సార్సీపీ నేతలు తమకు ఎవరూ అడ్డుకాదని ఓ పాఠశాల కొనసాగుతుండగానే వివాహం చేశారు. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జడ్పీ సీఈవోకు ఫిర్యాదు చేశారు. ఇదిలావుంటే పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో పాఠశాలలో వివాహ వేడుకులు నిర్వహించడం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేడుకలు ప్రైవేటు ఫంక్షన్​ హాళ్లలో జరుపుకోవాలని విమర్శిస్తున్నారు. ఒకవేళ పాఠశాల ఆవరణలో కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే ముందస్తుగా అధికారుల అనుమతి తీసుకోని జరుపుకోవాలని పలువరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఉందని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని ప్రతిపక్ష నాయకులు స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.