వైసీపీలో అసమ్మతి సెగలు- పార్టీని వీడి టీడీపీలో చేరుతున్న కార్యకర్తలు
🎬 Watch Now: Feature Video
YCP Activists Joining TDP After Leaving YCP: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రోజురోజుకు వైసీపీలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. పార్టీ నేతలే కాదు కార్యకర్తలు సైతం పార్టీలో గుర్తింపు లేక వైసీపీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. మంగళవారం విజయనగరం నియోజకవర్గానికి చెందిన వంద కుటుంబాలు వైసీపీ వీడి తెలుగుదేశంలోకి చేరాయి. నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పూసపాటి అదితి గజపతి రాజు వారికి పసుపు కండువ కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
జగన్ సర్కారును ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని గజపతి రాజు పేర్కొన్నారు. అన్ని రంగాలను ఇబ్బందులకు గురిచేసి, వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఈ సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా మీరంతా పార్టీలో చేరడం ఆనందకరమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించి, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తయారుచేయటం కోసం అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం 'బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ' కార్యక్ర మంలో భాగంగా 42, 46 డివిజన్లలో ఇంటింటికి ప్రచారం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఐవీపీ రాజు, వరప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.