మున్సిపాలిటీని ముట్టడించిన మహిళలు- ఖాళీ బిందెలతో నిరసన - Drinking Water Problems in Gooty - DRINKING WATER PROBLEMS IN GOOTY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 3:55 PM IST
Women Protest That No Drinking Water in Gooty: అనంతపురం జిల్లా గుత్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళలు ఆందోళనకు దిగారు. రెండు నెలల నుంచి తాగునీరు రావడం లేదని ఖాళీ బిందెలతో కార్యాలయం ముందు బైఠాయించారు. గ్రామంలో నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నా తాగునీరు సరఫరా చేయకపోతే ఎలా బతకాలని మున్సిపల్ కమిషనర్‌ను గ్రామస్థులు నిలదీశారు. మహిళలకు కమిషనర్ నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఇంకా ఎన్ని రోజులు ఇలాగే చెప్తారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మున్సిపల్ ట్యాంకర్లతో సరఫరా చేస్తున్న నీటిని ఇవ్వడానికి ట్యాంకర్ యజమానులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ధర్నా చేస్తేనే నీరు సరఫరా చేస్తారా లేకుంటే ఇవ్వరా అంటూ మహిళలు కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ట్యాంకర్ నీళ్లు కాలనీ మొత్తానికి ఏ విధంగా సరిపోతాయని అధికారులను ప్రశ్నించారు. నీటి కొరత ఉందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడే లేడని గ్రామస్థులు తెలిపారు. నీటి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.