లంచం ఇస్తే కానీ లోన్లు ఇవ్వనన్న బుక్ కీపర్ - డ్వాక్రా మహిళలు డిప్యూటీ తహసీల్దార్​కు వినతిపత్రం సమర్పణ - డ్వాక్రా రుణాలు ఇవ్వడం లేదని నిరసన

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 3:43 PM IST

Women Protest Against Not Giving Dwakra Loans: కృష్ణా జిల్లా అవనిగడ్డ పంచాయతీ పరిధిలోని 8వ వార్డులో బుక్ కీపర్ రత్నకుమారి లంచం ఇస్తే కానీ లోన్లు ఇవ్వనని చెప్పి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని షాలేమ్ డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. లంచం ఇస్తే కానీ లోన్ మంజూరు చేయనని డ్వాక్రా గ్రూప్ సభ్యులకు బుక్ కీపర్ తేల్చి చెప్పడంతో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట డ్వాక్రా మహిళలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్​కు వినతిపత్రం అందించారు. బుక్ కీపర్ లంచం ఇస్తే కానీ తమకు లోన్ ఇచ్చేది లేదని చెప్పినట్లు గ్రూప్ సభ్యులు డిప్యూటీ తహసీల్దార్​కు విన్నవించారు. 

బుక్ కీపర్​పై ఫిర్యాదు చేయాలని వెలుగు సీసీ, ఏసీల వద్దకు వెళితే సీసీ సువర్ణ స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫోన్ చేయించాలన్నారు. బ్యాంక్ రుణాల మంజూరు కోసం ఎమ్మెల్యే కార్యాలయం నుంచి అనుమతి పొందాలని వెలుగు అధికారులు చెప్పడంతో దాన్ని గ్రూప్​ సభ్యులు తీవ్రంగా ఖండించారు. వెలుగు అధికారులపై కలెక్టర్​ తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్​కు వినతిపత్రం ఇచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.