వైసీపీ ఎమ్మెల్యే, ఆయన భార్య పంచాయితీ - 'మీరెవరంటూ' ప్రచారంలో నిలదీసిన మహిళ - Women Stopped ycp MLA Wife Campaign - WOMEN STOPPED YCP MLA WIFE CAMPAIGN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 24, 2024, 12:10 PM IST
|Updated : Apr 24, 2024, 3:26 PM IST
Woman Stopped YSRCP MLA Shilpa Wife Campaign in Nandyala : నంద్యాలలో ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిణి రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. నూనెపల్లెలో పరిధిలో సోమవారం ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. తన జీవితం నాశనం చేశారంటూ, తన జీవితంలో రావడానికి మీరెవరంటూ ఓ మహిళ నాగిణిని నిలదీసింది. అక్కడినుంచి ఆమె వెళ్లిపోతుండగా, ఒక ఆడపిల్లకు సమాధానం చెప్పలేరా అంటూ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారానికి అడ్డొస్తోందని మహిళను వైసీపీ కార్యకర్తలు పక్కకు నెట్టేశారు.
అయినా సరే ఆమె వెంబడిస్తుండటంతో నాగిణి రెడ్డి ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసి కారులో వెళ్లిపోయారు. బాధిత మహిళ కుటుంబ సమస్య విషయంలో ఎమ్మెల్యే, ఆయన భార్య పంచాయితీ చేసినట్లు సమాచారం. ఈ కారణంగానే తనకు అన్యాయం చేశారని బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పట్టణంలో చర్చ జరుగుతోంది. భావోద్వేగంతో మాట్లాడిన ఆ మహిళ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.