న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే లైంగికంగా వేధించారు: డీజీపీకి బాధితురాలు ఫిర్యాదు - WOMAN COMPLAINT ON KAKINADA ASP - WOMAN COMPLAINT ON KAKINADA ASP
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-04-2024/640-480-21173569-thumbnail-16x9-women-complaint-on-kakinada-asp.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 8, 2024, 3:00 PM IST
Woman Complaint to DGP on Kakinada ASP : న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే ఓ పోలీసు అధికారి తనను లైంగికంగా వేధించి (Harassment) లొంగదీసుకున్నారని కాకినాడకు చెందిన ఓ మహిళ డీజీపీకి ఫిర్యాదు చేశారు. చాలా కాలంగా పోరాడుతున్నా నిందితుడిపై కనీస చర్యలు లేవని బాధిత మహిళ వాపోయారు. పోలీసు అధికారులే ఆయన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వ్యక్తిపై 2022 ఏప్రిల్‌లో కాకినాడ (Kakinada) రెండో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశానని, అతడిపై చర్యలు తీసుకోకపోవడం వల్ల గతంలో ఏఎస్పీని ఆశ్రయించానని పేర్కొన్నారు.
నిందితుడిని అరెస్టు చేసి న్యాయం చేస్తానని చెప్పిన ఏఎస్పీ, తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. తనను, తన కుటుంబాన్ని ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టారో ఫిర్యాదులో వివరించారు. బాధితురాలి ఫిర్యాదుపై డీజీపీ విచారణకు ఆదేశించారు. ఏలూరు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ఫిర్యాదు చేసిన మహిళపై ఆంధ్ర, తెలంగాణ పోలీసు స్టేషన్లలో పలు చీటింగ్ (Cheating) కేసులు ఉన్నాయని అధికారులంటున్నారు. విచారణ పూర్తయితేనే కేసులో స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.