జనసేన నేతలే తప్పుడు ప్రచారం చేయించారని చెప్పాలని ఎమ్మెల్యే బెదిరింపులు - MLA Madhusudhan Reddy threatening
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 9, 2024, 2:49 PM IST
Women Allegations on Srikalahasti MLA Madhusudhan Reddy : అధికారం, అహంకారం, అరాచకం మూడు కలగలిస్తే నేరగాళ్లు ఎలా పేట్రేగిపోతారో అలాగే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతలు, వాళ్ల అనుచరులు చెలరేగిపోతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దాడులకు దిగడం సర్వసాధారణం అయిపోయింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే జనసేన పార్టీ నేతలపై తప్పుడు ప్రచారం చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఓ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా తెలిపిన వివరాలివీ.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని రేణిగుంట మండలం అడుసుపాలెం గ్రామానికి చెందిన మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ విజయయాత్రలో భాగంగా నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ వినూత 'ఏపీ నీడ్స్ పవన్ కల్యాణ్ (AP Needs Pawan Kalyan)' కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ఆ గ్రామంలో పర్యటించారు. భూమి విషయంలో ఎమ్మెల్యేపై వ్యతిరేకంగా మీడియాతో మాట్లాడినందుకు, జనసేన నేతలే తప్పుడు ప్రచారం చేయించారని చెప్పాలని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి సూచించారని ఆ మహిళా వినూతకు వివరించారు. ఎమ్మెల్యే కార్యాలయానికి పిలిపించి క్షమాపణ చెప్పాలని బెదిరింపులకు దిగుతున్నారని వినూత ముందు వాపోయారు.