ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో ఇద్దరు అరెస్ట్ - మరొకరి కోసం గాలింపు - police arrest illegal affair case

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 18, 2024, 6:11 PM IST

Updated : Feb 18, 2024, 6:55 PM IST

Wife Killed Husband Along with Boyfriend Case : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలసి భర్తను భార్య హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీలత వెల్లడించారు. శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మండలం సున్నపు గుట్ట తండాలో ఖాదర్​ బాషా, గులాబ్ జాన్​లు భార్యభర్తలు. కొంతకాలంగా గులాబ్​ జాన్​,షేక్​ బాబ్జాన్​ల మధ్య వివాహేతర సంబంధం ఉంది. తమ వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన గులాబ్​ జాన్ తన​ భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. పథకం ప్రకారం జనవరి 31 రాత్రి ప్రియుడు షేక్​ బాబ్జాన్, అతని స్నేహితుడి షామిర్​తో కలిసి ఖాదర్​ బాషాను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకుని వెళ్లి కారెడ్డిపల్లి సమీపంలోని వాగు వద్ద పెట్రోల్ పోసి తగులబెట్టారు. 

అయితే మృతదేహం సరిగా కాలకపోవటంతో కొంత భాగాన్ని ప్లాస్టిక్ సంచిలో కుక్కి వాగులో పడేశారు. హత్య చేసిన అనంతరం ఏం తెలియనట్లుగా నటిస్తూ ఫిబ్రవరి 1న ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భర్త తిరిగి రాలేదంటూ అయిదో తేదీన కదిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు భార్య గులాబ్​ జాన్​పై అనుమానం వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించటంతో అసలు నిజం బయటకు వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుతొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు గులాబ్​ జాన్ అంగీకరించింది. దీంతో గులాబ్​ జాన్​ను, ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు పరారిలో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేకంగా బృందాలు గాలిస్తున్నాయని డీఎస్పీ శ్రీలత తెలిపారు.

Last Updated : Feb 18, 2024, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.