కళ్లకు గంతలు కట్టుకోని పోలీసులు తుపాకులను ఎలా లోడ్ చేస్తున్నారో చూడండి - Weapon Display by Police - WEAPON DISPLAY BY POLICE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 16, 2024, 10:31 PM IST
Weapon Display by Police During Independence Day Celebrations in Paderu : పోలీసులు శాంతి భద్రతలను కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పోలీసుల ఆయుధ ప్రదర్శన ఆకట్టుకుంది. శిక్షణ పొందిన పోలీసులు మూడు రకాల తుపాకీలతో ప్రదర్శన చేశారు. డబల్ బ్యారెల్, ఏకే 47, 70 ఎంఎం తుపాకీ ప్రదర్శనలో ఉంచారు. పోలీసులు కళ్లకు గంతలు కట్టుకోని పూర్తిగా తుపాకీ భాగాలు విడదీశారు. అనంతరం వాటిని యధాస్థితిలో తిరిగి బిగించారు. ఈ ప్రక్రియ పోలీసులు మధ్య స్నేహపూర్వక పోటీ మధ్య కొనసాగింది. ఈ ఆయుధాల వాడకంలో పోలీసులు అబ్బురపరిచారు. మూడు విభాగాలుగా చేసిన ఈ తుపాకీ ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ పోలీసులను అభినందించారు. ఈ సందర్భంగా పోలీస్ జాగిలం చేసిన ప్రదర్శన సైతం అందరినీ ఆకట్టుకుంది. పోలీసుల, పోలీస్ జాగిలం ప్రదర్శనను చిన్నారులు ఆసక్తిగా తిలకించారు.