వైసీపీ నేతలకు రెండు ఓట్లు - నంద్యాల ఓటరు జాబితాలో చిత్రవిచిత్రాలు - నంద్యాల ఓటరు జాబితాలో తప్పులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 12:24 PM IST
Voter List Errors Two Votes With YCP Leaders in Nandyal: నంద్యాల ఓటరు జాబితా తప్పుల తడకగా తయారైంది. చనిపోయిన వారి ఓట్లు ఉంచి, బతికి ఉన్నవారి ఓట్లు తొలగించడం ఎన్నికల అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. నియోజకవర్గంలో వైసీపీ నాయకుల పేర్లతో రెండేసి ఓట్లు నమోదయ్యాయి. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి పెదనాన్న రాజగోపాల్ రెడ్డి, పెద్దమ్మ సరస్వతి పేర్లు కడప జిల్లాలోని కొండసుంకేసుల గ్రామంలోనే కాకుండా నంద్యాలలో ఎమ్మెల్యే ఇంటి నంబరుతో రెండేసి ఓట్లున్నాయి. రాజగోపాల్ రెడ్డి, పెద్దమ్మ సరస్వతి స్వగ్రామం జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండసుంకేసుల గ్రామంగా పేర్కొన్నారు. నంద్యాల వైఎస్‌నగర్‌లో బతికి ఉండగానే కొందరి ఓట్లు తొలగించారు. ఇదే వార్డులో కొందరి పేర్లతో రెండేసి ఓట్లున్నాయిని తెలిపారు. వార్డులో నివాసంలేని వారి పేర్లూ ఓటరు జాబితాలో నమోదు చేశారు.
Voter List Errors in Anantapur: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని పుల్లగుట్టపల్లి గ్రామ ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఇచ్చిన తాజా జాబితాలో తమ గ్రామంలో లేని వారు ఓటర్లుగా ఉన్నారని గ్రామస్థులు తెలిపారు. మరణించిన వారి ఓట్లను తొలగించకుండా బ్రతికున్న వారి ఓట్లు తొలగించారని అసహనం వ్యక్తం చేశారు.