గ్రామ వాలంటీర్ దారుణ హత్య - వివాహేతర సంబంధమే కారణమా ? - Volunteer Murder news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 9:05 PM IST
Volunteer Murder in Anakapalli District : పెన్షన్ పంపిణీకి వెళున్న గ్రామ వాలంటీర్ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన అనకాపల్లి జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో ఈ దారుణం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలో కాలువ వద్ద వాలంటీర్ నడింపల్లి హరిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చి అక్కడే వదిలేసి వెళ్లారు. అటువైపు వెళ్తున్న గ్రామస్థులు హరి మృతదేహాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే మృతుడి కుటుంబీకులకు సమాచారాన్ని అందించారు.
Volunteer Murder in Lacchanna Palem : విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సంఘటన స్థలం వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు. హరి మృతదేహాన్ని చూసి తల్లి రాజులమ్మ బోరున విలపించింది. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. మృతుడి హరి వద్ద గాజులు, మరి కొన్ని వస్తువులు ఉన్నట్టు గ్రామస్థులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికు చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.