పెదవాగు ప్రాజెక్టుకు గండి- వరదలో కొట్టకుపోయిన వందలాది మూగజీవాలు- అస్తవ్యస్తంగా ప్రజా జీవనం - Villages Were Flooded in eluru dist - VILLAGES WERE FLOODED IN ELURU DIST

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 19, 2024, 11:15 AM IST

Villages Were Flooded Due to Pedavagu Project Embankment Broke :  తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో పెదవాగుపై ఉన్న ప్రాజెక్టుకు గురువారం రాత్రి భారీగా పడిన గండితో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రాజెక్టులోని నీళ్లన్నీ దిగువ గ్రామాల్లోకి వెళ్లడంతో ప్రాజెక్ట్  ఖాళీ అయింది. పెదవాగు ప్రాజెక్ట్ కట్ట తెగిపోవడంతో ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని కమ్మరిగూడెం, మేడేపల్లి, కోయి మాదారం, గుల్లవాయి, అల్లూరి నగర్, రెడ్డిగూడెం, గొల్లగూడెం, వసంతవాడ గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వరద నీటి తీవ్రతకు గ్రామాల్లోని పశువులు కొట్టుకుపోగా వేల ఎకరాలు పంటలు నీట మునిగింది. ఊళ్లపైకి వరద ముంచుకురావడంతో  చెట్లు, కొండలు, ఎత్తైన భవనాలపైనే రాత్రంతా ఆయా గ్రామాల ప్రజలు తలదాచుకున్నారు. వరద తగ్గిన అనంతరం గ్రామాల్లో రోడ్లు, ఇళ్లు బురద చెట్ల కొమ్మలతో దర్శనమిస్తున్నాయి. కరెంటు తీగలు తెగిపోయి చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి. దీంతో గ్రామస్తులు భయం భయంగా జీవిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.