నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా తెల్లరాయి అక్రమ రవాణ - అడ్డుకున్న గ్రామస్థులు - White Stone Illegal Transportation - WHITE STONE ILLEGAL TRANSPORTATION

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 25, 2024, 6:52 PM IST

Villagers Stopped White Stone Illegal Transportation: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్​ అడ్డు అదుపూ లేకుండా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అక్రమ మైనింగ్​పై ప్రతిపక్షాలు పోరు సాగిస్తున్నా, అక్రమ మైనింగ్ మరిగిన వైసీపీ నేతలు అధికారుల అండదండతో చెలరేగిపోతున్నారు. ఇలాంటి తరుణంలోనే జిల్లాలో మరోచోట మైనింగ్​కు తెరలేపారు. జిల్లాలోని సహజ వనరులను దోపిడిదారులు దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెల్లరాయి మాఫియా నేతల అండదండతో రెచ్చిపోయింది. 

తాజాగా జిల్లాలోని వావిలేరు వద్ద దేవాదాయ భూముల్లో తెల్లరాయి అక్రమ రవాణ యథేచ్ఛగా సాగుతుంది. గూడూరులో అధికార పార్టీకి అండదండలతో తెల్లరాయిని అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. గత ఐదేళ్లుగా అడ్డగోలుగా ఇసుక, సిలికా, మట్టి, గ్రావెల్, తెల్లరాయిని తవ్వేశారని మండిపడ్డారు. గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, చిన్నపిల్లలు గుంతల్లో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని వాపోయారు. ఇటీవల భారీగా తెల్లరాయిని తరలించే క్రమంలో వాహనం భూమిలో దిగబడిపోయింది. దీన్ని గమనించిన గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అధికారులు స్పందించి కేసు నమోదు చేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.