హైకోర్టులో స్టే ఉన్నా ఆగని నిర్మాణం: ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్న అధికారులు - సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం ఆందోళన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 22, 2024, 4:22 PM IST
Villagers Protest to Construct Service Road: తమ భూములకు రహదారి లేకుండా, నష్టపరిహారం చెల్లించకుండా రైల్వే అధికారులు వంతెన నిర్మాణం (Bridge Construction) చేపడుతున్నారని బాధితులు ఆందోళనకు దిగారు. రైల్వే అధికారులను రహదారి నిర్మాణం గురించి ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని బెదిరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కట్లేదని, ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
Construction Of Bridge By Railway Authorities Without Road: స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం సీతం కళాశాల సమీపంలో ఉన్న భూములు విషయంపై హై కోర్టులో స్టే(high court stay) ఉన్నా అధికారులు బేఖాతరు చేస్తున్నారు. భూములకు రహదారి సౌకర్యం కూడా లేకుండా, అడ్డంగా వంతెన నిర్మించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ నిర్మాణం జరగాలంటే ముందుగా సర్వీస్ రహదారి (Service Road) నిర్మించి తర్వాత వంతెన కడతారని ఇక్కడ ఆ విధంగా జరగట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు చెప్తున్నా ఇప్పటివరకు రాతపూర్వకంగా ఎటువంటి హామీ ఇవ్వట్లేదని స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల తమ గిడ్డంగులు ఖాళీ అయిపోయాయని, అద్దెకి ఎవరూ రాకపోవటంతో లక్షల్లో నష్టం చేకూరుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ వైర్లను తమ స్థలం మీదుగా ఇష్టానుసారం వేశారని దీనివల్ల ఎలాంటి ప్రాణనష్టం జరుగుతుందో అని ఆందోళనలో ఉన్నామని పేర్కొన్నారు. ఈ స్థలంలో రహదారి లేకపోవటంతో భూమి విక్రయం చేపట్టినా కొనేందుకు ఎవరు ముందుకు రావడం లేదని స్థానికులు వాపోతున్నారు.