కడపలో వ్యక్తి హత్య - నిందితులను పట్టుకుని శిక్షించాలని కుటుంబ సభ్యలు ఆందోళన - Villagers Protest Infront of PS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 3, 2024, 4:51 PM IST

Villagers Protest Infront of Police Station at Pendlimarri: వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలం యాదవపురం గ్రామానికి చెందిన గ్రామస్థులు మృతదేహంతో పోలీస్​స్టేషన్ (PS) ఎదుట ధర్నాకు దిగారు. నిందితులను (Accused) పట్టుకుని కఠిన శిక్ష విధించాలని కోరారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం మంగళవారం యాదవపురం గ్రామానికి చెందిన ఆదిమూలం శ్రీనివాసులు (35) పొలంలో (field) పని చేసుకుంటుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. 

Protest with Dead Body: ఈ రోజు ఉదయం పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్​తో వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. అయినప్పటికీ శ్రీనివాసులు కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. రహదారిపై ధర్నా చేయడంతో ట్రాఫిక్​కు అంతరాయం కలిగి వాహనాలు నిలిచిపోయాయి. నిందితులను త్వరగా పట్టుకుని కఠిన శిక్ష విధించి, తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.