యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం: ఎమ్మెల్యే సుజనా చౌదరి - Sujana Foundation Job Mela - SUJANA FOUNDATION JOB MELA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 11, 2024, 12:14 PM IST
MLA Sujana Providing Employment Opportunities to Youth: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. విజయవాడలో సుజనా ఫౌండేషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంయుక్తంగా మెగా జాబ్ మేళా నిర్వహించాయి. జాబ్ మేళాకు ఏడు వేల మందికిపైగా నిరుద్యోగులు హాజరయ్యారని సుజనా తెలిపారు. వారిలో 16 వందల 80 మంది మొదటి విడతగా ఉద్యోగాలు పొందారని, మరో 2 వేల 400 మందిని మరికొద్ది రోజుల్లో నిర్వాహకులు ఎంపిక చేస్తారని చెప్పారు.
పరిశ్రమలు లేక ఉపాధి అవకాశాలు రాక నిరుద్యోగం భారీగా పెరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాలకు సంబంధించిన కాపీలను అందజేశారు. గత ఐదు సంవత్సరాల పాలనలో ఉద్యోగ అవకాశాల్లేక యువత భవిష్యత్తు అంధకారంగా మారిందని విమర్శించారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి జీవనోపాధిని మెరుగు పరుస్తామన్నారు. సుజనా ఫౌండేషన్ ద్వారా రాబోయే రోజుల్లో మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.