దుర్గమ్మ దర్శనానికి ఆ సమయంలో రావొద్దు - వారికి ఈవో సూచన - Durgamma Temple Eo instructions - DURGAMMA TEMPLE EO INSTRUCTIONS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 29, 2024, 4:44 PM IST
Vijayawada Durgamma Temple Eo Instructions for Devotees : విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ ఈవో కె.ఎస్ రామారావు ముఖ్య సూచన చేశారు. వీఐపీలు, దివ్యాంగులు, వృద్ధులు, అధికారులు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి ఉదయం పదకొండున్నర నుంచి మధ్యాహ్నం ఒంటిగంటన్నర లోపు రావొద్దని ఈవో విజ్ఞప్తి చేశారు. దేవస్థానంలో అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సమయంలో మినహా మిగతా వేళల్లోనే దర్శనానికి రావాలని సూచించారు. అలాగే ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు మహా నైవేద్యం జరుగుతుందని ఈవో వెల్లడించారు.
అయితే రాష్ట్రంలో అవినీతిపాలన అంతమెుందిన వేళ, నూతన ప్రభుత్వం ఏపీలోని దేవాలయాల నిర్వహణలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే తిరుపతి తర్వాత ఏపీలోనే రెండో అతిపెద్ద దేవాలయమైన విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంపై సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఇంద్రకీలాద్రిపై జరిగినన్ని అక్రమాలు, అవినీతి నిర్వాకాలు గతంలో ఎన్నడూ చూడలేదు. దేవస్థానం ప్రతిష్ఠను సైతం దిగజార్చేలా వెండిసింహాల చోరీ సహా అనేక వివాదాలకు కేంద్రంగా అమ్మవారి ఆలయాన్ని మార్చేసిన పరిస్థితిని చూశాం. దీంతో దుర్గమ్మ దేవస్థానంపై నూతన సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది.