మహీధర్‌రెడ్డి సహకారం లేకుంటే గెలుపు కష్టమే: విజయసాయి రెడ్డి - VIJAYASAI REDDY APPRECIATIONS - VIJAYASAI REDDY APPRECIATIONS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 31, 2024, 1:43 PM IST
Vijayasai Reddy Appreciations to Maheedhar reddy in Nellore : వేంకటేశ్వర స్వామి సాక్షిగా తాము గెలిస్తే మహీధర్ రెడ్డి మాటే వేదంగా భావిస్తామని ఆయన సూచనలు తూచా తప్పకుండా పాటిస్తామని విజయసాయిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులో స్థానిక ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి (Vijayasai reddy), ఎమ్మెల్యే అభ్యర్థి బుర్ర మధుసూదన్ యాదవ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ మహీధర్ రెడ్డిపై విజయసాయి ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన సహకారం లేకుండా తమ గెలుపు కష్టమవుతుందన్నారు.
Manugunta Maheedhar Reddy : మహీధర్‌రెడ్డి తనకెంతో మేలు చేశారని దానికి కృతజ్ఞుడి ఉంటానని పేర్కొన్నారు. తాను చాలా గొప్ప వ్యక్తి అని తన సహాయ సహకారం ఎల్లవేళలా అందించాలని విజయసాయి మహీధర్ రెడ్డిని ఉద్దేశిస్తూ అన్నారు. ఆత్మీయ సమావేశం మొత్తం భజన కార్యక్రమంలా సాగిందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.