'నిందితులకు కొమ్ముకాస్తున్న పోలీసులు' - వృద్ధుడి హత్యపై బంధువుల ఆందోళన - వృద్దుడు హత్య
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 21, 2024, 4:49 PM IST
Victims Protest Arrest The Perpetrators of Murder in Inturu: బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం ఇంటూరులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నాలుగు నెలల క్రితం ఇంటూరు గ్రామంలో తిరుపతయ్య (65) అనే వృద్దుడు హత్యకు గురయ్యాడు. హత్యకు పాల్పడిన వారిని పోలీసులు ఇంతవరకు అరెస్టు చేయలేదని బాధితుడి బంధువులు మండిపడ్డారు. నిందితులను అరెస్టు చేయాలని బాధితుడి బంధువులు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. హత్యకు పాల్పడిన నిందితులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు వృద్ధుడి మృతదేహాన్ని వెలికి తీయాలని రహదారిపై నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు డిమాండ్ చేశారు. ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ సంభవించడంతో పోలీసులు వారిని ఆందోళన విరమించాలని కోరారు. పోలీసుల మాటలను వారు పట్టించుకోకపోవడంతో నిరసనకారులను పోలీసులు అక్కడి నుంచి లాఠీలతో చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. రహదారిపై నిలిచిపోయిన వాహనాలను పోలీసులు క్రమబద్ధీకరించారు.