జగన్ రెడ్డి రాష్ట్రాన్ని 'అప్పుల ఆంధ్రప్రదేశ్'గా మార్చేశాడు: టీడీపీ - Varla Ramaiah Question To YS Jagan - VARLA RAMAIAH QUESTION TO YS JAGAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 3, 2024, 3:41 PM IST
Varla Ramaiah Question To YS Jagan: జగన్ రెడ్డి రాష్ట్రాన్ని "అప్పుల ఆంధ్రప్రదేశ్"గా మార్చేశాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య దుయ్యబట్టారు. బినామీ కాంట్రాక్టర్లు, ఇష్టమైన కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించడానికి కమీషన్లకు కక్కుర్తిపడి పరిమితికి మించి అప్పులు చేశాడని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత కూడా రేపు రానున్న రూ. 4 వేల కోట్ల అప్పుతో దాదాపు రూ. 25 వేల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. అప్పుల్లో జూన్ 1కి కేంద్ర ప్రభుత్వ ఎఫ్ఆర్బీఎమ్ పరిమితిని దాటిపోయిందని అన్నారు.
ఎన్నికల ప్రకటన తరువాత జగన్ తెచ్చిన 21 వేల కోట్ల ఎవరికి ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయగలరా, ఆ ధైర్యం మీకు ఉందా అని వర్ల రామయ్య ప్రశ్నించారు. చీఫ్ సెక్రెటరీ, ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణలు రేపు ఆర్బీఐ బాండ్స్ ద్వారా వచ్చే రూ. 4 వేల కోట్లు ఎవరికి విడుదల చేయవద్దని అన్నారు. 66 సంవత్సరాల్లో 18 మంది సీఎంలు రూ. 3,62,375 కోట్లు అప్పు చేస్తే, జగన్ రెడ్డి ఒక్కడే ఈ ఐదేళ్లలో రూ. 8 లక్షల కోట్లు అప్పులు తెచ్చాడని ఆరోపించారు. అస్మదీయ కాంట్రాక్టర్లకు చెల్లించి కమీషన్ లు దండుకునేందుకు అప్పులు చేశారని వర్ల రామయ్య దుయ్యబట్టారు.