శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం- ఫైల్‌పై సంతకం చేయకుండా తిప్పిపంపిన మంత్రి - Srilakshmi faced bitter experience - SRILAKSHMI FACED BITTER EXPERIENCE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 16, 2024, 7:52 PM IST

Urban Development Department CS Srilakshmi: పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆమెకు వరుస అవమానాలు ఎదురవుతున్నాయి. రెండ్రోజుల క్రితం సీఎం చంద్రబాబు నాయుడు శ్రీలక్ష్మి ఇస్తున్న బొకే తీసుకోవటానికి నిరాకరించారు. మిగిలిన ఐఏఎస్ అధికారుల నుంచి పుష్పగుచ్ఛాలను తీసుకున్న ఆయన శ్రీలక్ష్మి నుంచి మాత్రం బొకేను తీసుకోలేదు. ఇవాళ మరోసారి ఆమెకు మంత్రి నారాయణ నుంచి చేదు అనుభవం ఎదురైంది. 

మంత్రిగా నారాయణ బాధ్యతలను స్వీకరిస్తున్న సమయంలో శ్రీలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మంత్రి నారాయణ మొదటి సంతకం చేయాల్సిన ఫైళ్లను ఆయన ముందు ఉంచే ప్రయత్నం చేశారు. అయితే శ్రీలక్ష్మి తీసుకొచ్చిన పైల్​పై సంతకం పెట్టేందుకు మంత్రి నారాయణ నిరాకరించారు. ఇప్పుడు ఫైళ్లపై సంతకాల వంటివి ఏమీ వద్దంటూ మంత్రి నారాయణ శ్రీలక్ష్మి తెచ్చిన ఫైల్‌ను తిప్పి పంపారు. జీవోలపై శ్రీలక్ష్మి సంతకాలు ఉండకూడదని ప్రభుత్వ పెద్దల ఆదేశించినట్లు తెలిసింది. శ్రీలక్ష్మిని బదిలీ చేసే వరకు ఆమెకు ఫైళ్లు పంపకూడదని ప్రభుత్వం భావిస్తోన్నట్లు సమాచారం. శ్రీలక్ష్మిని పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించి జీఏడీకి పంపుతారన్న ప్రచారం ఐఏఎస్ వర్గాల్లో వ్యక్తమవుతుంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.