మల్లవల్లికి కొత్త పరిశ్రమలు - నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు - Unemployees Interview at Mallavalli - UNEMPLOYEES INTERVIEW AT MALLAVALLI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 5, 2024, 10:58 AM IST
Unemployees Interview at Mallavalli: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కృష్ణా జిల్లా మల్లవల్లిలో మధ్యలో ఆగిపోయిన చాలా పరిశ్రమలు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. కొత్త పరిశ్రమలను స్థాపించేందుకు కూడా ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పారిశ్రామిక వేత్తలతో ఇప్పటికే సంప్రదింపులు కొనసాగుతుండగా, మరోవైపు కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు రాబట్టేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో ఐదేళ్లుగా ఉపాధి అవకాశాలు లేక నానావస్థలు పడిన నిరుద్యోగులకు కూటమి రాకతో ఆశలు చిగురించాయి.
ఏపీ ఐఐసీ ఆధ్వర్యంలో 2016లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పారిశ్రామికవాడకు అంకురార్పణ చేసింది. అయితే వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే పరిశ్రమలు తరలిపోవడంతో ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు పరిశ్రమలు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న తరుణంలో స్థానిక నిరుద్యోగులు మల్లవల్లికి క్యూ కడుతున్నారు. పరిశ్రమల కార్యాలయాల్లో అధికారులను కలిసి విద్యార్హత పత్రాలను సమర్పిస్తున్నారు. మల్లవల్లి పారిశ్రామికవాడలో నిరుద్యోగుల సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.