హడావుడిగా డీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేశారు: నిరుద్యోగుల ఆందోళన

🎬 Watch Now: Feature Video

thumbnail

Unemployees  Angry with DSC Notification : పాదయాత్ర సమయంలో ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చిన జగన్‌, అధికారంలోకి వచ్చాక తమను మోసగించారని నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వటాన్ని ఏఐవైఎఫ్ ఖండించింది. వెంటనే మెగా డీఎస్సీ ప్రకటించాలని అనకాపల్లిలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ డీఎస్సీ ప్రకటించి ఎవరిని మభ్య పెట్టాలనుకుంటున్నారని కర్నూలు కలెక్టరేట్ ఎదుట డీఎస్సీ అభ్యర్థులతో ధర్నా చేపట్టారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావిడిగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రెంటిస్ విధానాన్ని ఎత్తివేయాలని, స్పెషల్ డీఎస్సీ విడుదల చేయాలని కోరారు. నోటిఫికేషన్ నుంచి పరీక్షా సమయం వరకు కనీసం 45 రోజుల వ్యవధి ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత నోటిఫికేషన్​ వల్ల చదువుకునే అవకాశం కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.