నిండు ప్రాణాల్ని బలిగొన్న ఈత సరదా - పుట్టినరోజు వేడుకులకు వెళ్లి మృతులుగా మారిన యువకులు - Young Men died - YOUNG MEN DIED

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 14, 2024, 1:15 PM IST

Two Young Men Lost Their Lives After Going Swimming : ఈత సరదా రెండు నిండు ప్రాణాలను బలిగొంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం శివరాజ్ నగర్ వద్ద చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరి యువకులు గల్లంతయ్యారు. గురువారం సాయంత్రం జరగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుల్లో ఒకరు కొనకనమిట్ల మండలం వాగుమడుగు గ్రామానికి చెందిన వారు కాగా మరొకరు దర్శి మండలం నూతగిరి కాలనీకి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు.

పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని గురువారం సాయంత్రం కొంత మంది యువకులు శివరాజ్​నగర్​ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. వేడుకల అనంతరం అందరూ ఇళ్లకు వెళ్ళిపోగా చందు, నవీన్ అనే యువకులు చెరువులో ఈతకు దిగి మృతి చెందారు. చెరువులో లోతైన ప్రదేశంలో ఈతకు వెళ్లి మృతి చెంది ఉండవచ్చని కుటుంబం సభ్యులు భావిస్తున్నారు. మృతి చెందిన వారిన శవ పంచనామా నిమిత్తం దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో దర్శి మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.