పట్టపగలే బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు - వృద్ధురాలిపై దాడి, తీవ్రగాయాలు - Thieves Gold Robbery - THIEVES GOLD ROBBERY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 29, 2024, 9:56 PM IST
Two Thieves Gold Robbery in Palakollu : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పట్టపగలే దొంగలు హల్చల్ చేశారు. అనసూయ అనే వృద్ధురాలిపై దాడి చేసి బంగారం దొంగలించారు. పాలకొల్లులోని బొండాడ వారి వీధిలో కలిశెట్టి అనసూయ అనే వృద్ధురాలు భవనంలో ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు దుండగులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డారు. రాయితో ఆమె తలపై బలంగా కొట్టి తీవ్రంగా గాయపరిచారు.
అనంతరం ఆమె మెడలోని గొలుసు, చెవి దిద్దులు, నాలుగు బంగారం గాజులు అపహరించుకుపోయారు. భవనం పైఅంతస్తులో ఉన్న ఆమె కూతురు, స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన అనసూయను రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. బంగారం దొంగిలించిన వారిని గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.