అల్లూరి జిల్లాలో ఎంపీటీసీ దారుణహత్య - పోలీసుల ఎదుట లొంగిపోయిన ఇద్దరు వ్యక్తులు - Two Persons Kill MPTC Hitting Stone - TWO PERSONS KILL MPTC HITTING STONE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 19, 2024, 10:47 AM IST
Two Persons Killed MPTC by Hitting With Stone : ఓ వ్యక్తిని తలపై కొట్టి హత్య చేసిన దారుణ ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందంటే జిల్లాలోని చింతూరు డివిజన్ కన్నయ్యగూడెంలో ఎంపీటీసీ సభ్యుడు వర్ష బాలకృష్ణ హత్యకు గురయ్యారు. ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామ శివారులో ఇద్దరు వ్యక్తులు అతడిని అడ్డగించి బండరాయితో తలపై కొట్టి హత్య చేశారు.
MPTC Murder in Alluri District : భూమి కొనుగోలు విషయంలో పాత కక్షలు ఉండటంతోనే అతడిని హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య చేసిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన ఇద్దరి నిందితులు ఏటపాక పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. పోలీసులు ఇద్దరి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంపీటీసీకి ఆ ఇద్దరి వ్యక్తులకు అసలు గతంలో ఉన్న వివాదం ఏంటి అనే దానిపై పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.