వైఎస్సార్సీపీ మునిగిపోయే పడవ లాంటిది: తులసిరెడ్డి - కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 4, 2024, 4:47 PM IST
Tulasi Reddy Comments on YSRCP Goverment in YSR District : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ లాంటిదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. కడప జిల్లా వేంపల్లిలో పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో కేసీఆర్‌కు పట్టిన పరిస్థితే సీఎం జగన్‌కు వస్తుందని జోస్యం చెప్పారు. సీఎం జగన్‌పై అన్ని వర్గాలలో అసంతృప్తి తారాస్థాయిలో ఉందని పేర్కొన్నారు. అన్ని సర్వేలు వైసీపీ ఓటమి తధ్యం అంటున్నాయని తెలిపారు.
సీఎం జగన్ ఒకసారి ముఖ్యమంత్రి అయితేనే సచివాలయాన్ని తాకట్టు పెట్టారు, మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని హోల్ సేల్‌గా అమ్ముతారని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం ప్రారంభం అయ్యిందని పేర్కొన్నారు. గతంలో కర్ణాటక, తెలంగాణలో అధికారం కైవసం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రానున్న ఏపీ ఎన్నికల్లో కూడా అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీని ఆహ్వానిస్తుందని పేర్కొన్నారు.