మరింత నాణ్యంగా శ్రీవారి లడ్డూ- పోటు కార్మికులతో ఈవో సమావేశం - TTD EO met with the potu workers - TTD EO MET WITH THE POTU WORKERS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 22, 2024, 10:32 AM IST

TTD EO Meeting with Potu Workers on Improving Laddu Quality : శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీపై తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో అధికారులతో టీటీడీ ఈవో శ్యామలరావు సమావేశం నిర్వహించారు. లడ్డూ తయారీలో ఉన్న సమస్యలు, నాణ్యతా లోపంపై వస్తున్న విమర్శలకు గల కారణాలను పోటు కార్మికులను అడిగి తెలుసుకున్నారు. పోటు కార్మికులు లడ్డూల తయారీలో వినియోగిస్తున్న శెనగపిండి, నెయ్యి, యాలకుల నాణ్యత మరింత పెంపొందించాలని ఆదేశించారు. పని భారం పెరిగిపోవడంతో అదనపు సిబ్బందిని తదనుగుణంగా నియమించాలని కార్మికులు, ఈవోను కోరారు.  ముడి సరుకులను టెండర్ల ద్వారా సేకరిస్తున్నామని, తక్కువ ధరకు  తెలిపిన వారి వద్దనుండి కొనుగోలు చేస్తామని సంబంధిత అధికారులు ఈవోకు వివరించారు.

ఇదిలా ఉండగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు శుక్రవారం నాలుగు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి దర్శనానికి మూడు గంటల సమయం పట్టిందని సిబ్బంది తెలుపుతున్నారు. గురువారం శ్రీవారిని 62,756 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.4.23 కోట్లు హుండీ కానుకలు లభించాయని ఆలయాధికారులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.