శ్రీ కాళహస్తిలో మాఘ పౌర్ణమి వేడుకలు: ఘనంగా త్రిశూల స్నానం - శ్రీకాళహస్తిలో మాఘ పౌర్ణమి పూజలు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 24, 2024, 5:50 PM IST
Trishoola Stanam in Srikalahasti: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈరోజు ఘనంగా త్రిశూల స్నానం నిర్వహించారు. మాఘ పౌర్ణమి (Magha Pournami) పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో త్రిశూల స్నానం చేపట్టినట్టు ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయంలోని అలంకార మండపం నుంచి సోమ స్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి, వినాయక స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి ఉత్సవంగా స్వర్ణముఖి నదికి (Swarnamukhi River) చేరుకున్నారు.
Special Pujas at Sri kalahasteeshwara Temple on Occasion of Magha Pournami: స్వామివారికి వేద పండితుల మంత్రోచ్ఛరణల (Chants) మధ్య పూజలు చేపట్టి సధ్యో ముక్తి వ్రతం నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు త్రిశూల స్నానం నిర్వహించి దేవతామూర్తులకు ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు (Devotees) తరలి రావడంతో సువర్ణముఖి నది తీర ప్రాంతం శివనామ స్మరణతో మార్మోగింది.