అభివృద్ధి పేరిట గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు : ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంత గిరిజనులు - Tribals protest at aob
🎬 Watch Now: Feature Video
Tribals Protest at AOB in Parvathipuram Manyam District : గిరిజన భూములకు రక్షణ కల్పించి, వారికోసం ప్రభుత్వం చేసిన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని మన్యం జిల్లాలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంత గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నేత వంతల సుందర రావు మాట్లాడుతూ, ఒడిస్సా ప్రభుత్వం అక్రమంగా మైనింగ్ తవ్వకాలకు అనుమతిలిస్తూ గిరిజనుల సాగు భూములను లాక్కోవాలని ప్రయత్నం చేస్తుందని తెలిపారు. ధూళి భద్ర, దిగు సింబి, ఎగో సెంబి తదితర గ్రామాలన్నీ షెడ్యూల్ గ్రామాలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ఈ గ్రామాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్నా గిరిజనుల గ్రామ సభ అనుమతులు ఉండాలని గుర్తు చేశారు.
కానీ ఒడిస్సా ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా మైనింగ్ లీజులు మంజూరు చేస్తుందని మండిపడ్డారు. అభివృద్ధి పేరిట గిరిజనులను అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఒడిస్సా ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పాటించకుండా ఇష్టానుసారంగా గిరిజనులపైన, ప్రభుత్వం ఉద్యోగులపైన దాడులు చేస్తున్న ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రభుత్వన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోల్కొని గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.