'జగన్ మామయ్యా చూస్తున్నావా?'- మధ్యాహ్న భోజనంలో మట్టి పోసుకున్న విద్యార్థులు
🎬 Watch Now: Feature Video
Tribal Students Protest on Mid Day Meal Scheme: మధ్యాహ్న భోజనం పెట్టడంలేదని గిరిజన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లేట్లలో మట్టి పోసుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ ఘటన అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పూతుకుపుట్టు గ్రామానికి చెందిన ఎంపీపీ గిరిజన పాఠశాలలో చోటుచేసుకుంది. 'జగన్ మామయ్యా నాలుగు నెలలుగా మాకు మధ్యాహ్న భోజనం పెట్టడం లేదు' అంటూ నినాదాలు చేశారు. మధ్యాహ్నం భోజనం లేకపోతే మట్టి తిని బతకాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం భోజనం పథకంలో భాగంగా పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిందేనని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
Problems in Mid Day Meal Scheme: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచడంతో పాటు, పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన మధ్యాహ్న భోజన పథకానికి నిధుల కొరత సమస్య వేధిస్తోంది. విజయనగరం, మన్యం జిల్లాల్లోని పాఠశాలల్లో ఇటీవల ఆహారం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వం నిర్వాహకులకు ఇచ్చే డబ్బులు చాలక నాణ్యత లోపించడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది.