భాగ్యనగరానికి ఏపీ ఓటర్లు తిరుగు ప్రయాణం - ట్రాఫిక్ సమస్యలు మళ్లీ షురూ ! - Voters Return Journey to Hyderabad - VOTERS RETURN JOURNEY TO HYDERABAD
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 13, 2024, 6:03 PM IST
Traffic Problems Started Again Voters Return Journey from AP to Hyderabad : ఎన్టీఆర్ జిల్లా నందిగామ-విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై మళ్లీ రద్దీ నెలకొంది. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు వరుసగా వెళ్తున్నాయి. నందిగామ వై జంక్షన్ వద్ద హైవే విస్తరణ పనులు జరుగుతుండటంతో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు నిదానంగా వెళ్తున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో కొంత ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఓటర్లు శనివారం ఉదయాన్నే హైదరాబాద్ నుంచి ఏపీకి చేరుకుని శని, ఆదివారాల్లో ఇక్కడే ఉండి సోమవారం ఓటేసి తిరిగి హైదరాబాద్కు బయలుదేరారు. ఈ సారి ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్ల వరుసలతో బార్లు తీరారు. పోలింగ్ శాతం కూడా గణనీయంగా పెరిగింది. సాయంత్రం ఐదు గంటలకు సుమారు 68 శాతం పోలింగ్ నమోదైంది. ఇంకా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేసేందుకు ఓటర్లు క్యూలైన్లో వేచి ఉన్నారు.