రోడ్డుపై గుంతలో ఇరుక్కుపోయిన లారీ - భారీగా ట్రాఫిక్ జామ్
🎬 Watch Now: Feature Video
Traffic Jam in Parvathipuram District : రాష్ట్రంలో అసలే అంతంత మాత్రం రోడ్లు. ఆపై గోతులు, అందులో ఏమైనా పెద్ద వాహనాలు నిలిచి పోతే జనానికి చుక్కలు కనిపించడం ఖాయం. అంతరాష్ట్ర రహదారి గుంతలో లారీ ఇరుక్కుపోవడంతో పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని కొమరాడ మండలం గుమడ వద్ద అంతరాష్ట్ర రహదారి గుంతలో లారీ ఇరుక్కుపోయింది. రోడ్డుకు ఇరువైపులా 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గుంతలో ఇరుక్కున్న లారీని పక్కకు తీసేందుకు వాహనాల డ్రైవర్లు శ్రమిస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి పార్వతీపురం నుండి కూనేరు వరకు వెళ్లే రహదారి మార్గంలో గోతులు పూడ్చాలని గుమడ గ్రామస్థుల డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే తామే ఈ నెల 28 తేదీ స్వయంగా గుంతలు పూడుస్తామని స్థానికులు హెచ్చరించారు. రహదారి మధ్యలో భారీ వాహనాలు నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు అవస్థలు పడ్డారు. గుమడ గ్రామం అంతరాష్ట్ర రహదారి గుంతలో దిగిపోయిన లారీ వద్ద సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి స్పందించి, సంబంధించిన అధికారులతో ఈ మార్గంలో రహదారి మరమ్మతులు చెప్పటించి వాహనదారులు, ప్రయాణికులు ప్రాణాలు కాపాడాలి కోరారు.