'స్టార్ట్, కెమెరా, ఓవరాక్షన్' రోడ్డుపై సినిమా షూటింగ్ - ట్రాఫిక్​లో జనం అవస్థలు - movie shooting against rules

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2024, 5:00 PM IST

Traffic Jam Due to Movie Shooting in Tirupati: తిరుపతిలో సినిమా షూటింగ్ పేరుతో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలిపిరితో పాటు నందికూడలి, గోవిందరాజు స్వామి ఆలయంలో షూటింగ్​కు పోలీసులు అనుమతించారు. రెండు రోజుల పాటు సినిమా చిత్రీకరణకు ఉదయం 6 నుంచి 10 వరకు, 11 నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు అనుమతించారు. 

People Angry Giving Permission Temple Premises: టీటీడీ ప్రాంగణాల్లో చిత్రీకరణకు అనుమతి ఇవ్వడంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్​కు ఆంక్షలు పెట్టకూడదని, పోలీసు సిబ్బందిని బందోబస్తుకు ఇవ్వలేమని అనుమతి పత్రాలలో పోలీసులు స్పష్టం చేశారు. కానీ చిత్ర బృందం అనుమతులు పొందిన దానికి విరుద్ధంగా అలిపిరి, నందికూడలిలో సినిమా షూటింగ్ జరిగింది. పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను పోలీసులు నిలిపివేశారు. దీనిపై భక్తులు, నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.