'ఏకపక్ష నిర్ణయాలతో కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు- బయోమెట్రిక్ హాజరు నిలిపేయాలి' - బయోమెట్రిక్ విధానాన్ని నిలిపివేయండి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 28, 2024, 12:42 PM IST
Trade Union Leaders Demand to Stop Biometric Method: విశాఖ ఉక్కు కర్మాగారంలో బయోమెట్రిక్ (Biometric) విధానాన్ని నిలిపివేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు డైరెక్టర్ పర్సనల్ కార్యాలయాన్ని దిగ్బంధించి, కార్యాలయంలో పడుకొని నిరసన తెలిపారు. మార్చి 8 నుంచి అమలు చేయనున్న బయోమెట్రిక్ విధానం నిలిపివేయాలని డైరెక్టర్‌తో చర్చలు విఫలం కావటంతో మంగళవారం రాత్రి నుంచి కార్మిక సంఘాల నేతలు అడ్మిన్ బిల్డింగ్ ముందు నిరసన చేపట్టారు.
కార్మికుల వేతనాలు అమలు, స్టీల్ ప్లాంట్‌ను (Vizag Steel Plant) పూర్తి సామర్థ్యంతో నడపాలని, రా మెటీరియల్‌కు అవసరమైన రైల్వే ర్యాకులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘం నాయకులు డి. ఆదినారాయణ మాట్లాడుతూ సమస్యలు మూడు పర్యాయాలుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం అన్యాయమన్నారు. ఇతర ఉక్కు పరిశ్రమల్లో కార్మిక సమస్యలు పరిష్కరించిన తర్వాత బయోమెట్రిక్ అమలు చేస్తున్నారని, విశాఖ ఉక్కు పరిశ్రమలో ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించకుండా బయోమెట్రిక్ విధానం అమలు చేస్తే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు.