అరకులోయలో పర్యాటకుల సందడి - మండుటెండల్లోనూ పొగమంచు అందాలు - అరకులోయలో పర్యటకుల సందడి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2024, 1:11 PM IST
Tourists Visit Arakuloya in Alluri District : ఆంధ్ర ఊటీ, భూతల స్వర్గంగా పేరుగాంచిన అందాల అరకులోయ పర్యాటకులతో సందడిగా మారింది. ప్రకృతి సిద్ధ అందాలకు నిలయమైన అరకులోయ సమీపంలోని మాడగడ వ్యూ పాయింట్ వద్ద పొగమంచు అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఎండకాలంలో కూడా ఇక్కడ చల్లటి వాతావరణంతో పర్యాటకులను కనువిందు చేస్తుంది. ఇక్కడి ప్రకృతిని ఆస్వాదించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా అరకు విచ్చేస్తున్నారు. ప్రకృతి అందాల నడుమ ఫొటోలు దిగుతూ ఆనంద పరవశ్యంలో మునిగి తేలుతున్నారు.
Araku Beauty that Attracts Tourists : అల్లూరి జిల్లాలోని అరకులోయ మాట వింటేనే మన కళ్లకు ప్రకృతి రమణీయత ప్రత్యక్షమవుతుంది. అలాంటి అరకులోయను ప్రత్యక్షంగా వీక్షిస్తే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేము. అప్పుడు మనం స్వర్గంలో ఉన్నామా లేదా భూమిపై ఉన్నామా అనే సందేహం రాకుండా ఉండదు. అరకులోయ మన రాష్ట్రానికే కాదు, దేశంలోనే ఓ అద్భుతమైన పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది. అరకులోయ అణుఅణువు ప్రకృతి రమణీయత తాండవిస్తుంది.