ఎత్తిపోతలకు జలకళ - భారీగా తరలివస్తున్న సందర్శకులు - Tourist Rush at Ethipothala - TOURIST RUSH AT ETHIPOTHALA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 22, 2024, 11:46 AM IST

Tourist Rush at Ethipothala Water Falls in Palnadu District : పల్నాడు జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతల జలపాతానికి సందర్శకుల తాకిడి పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలపాతం సరికొత్త శోభను సంతరించుకుంది. ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, పాల నురగల జలపాతాలు ఈ అందమైన ప్రకృతి దృశ్యాన్ని వీక్షించడానికి  పర్యటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. 70 అడుగుల ఎత్తు నుంచి వరద నీరు జాలువారడం, కనువిందు చేస్తోంది. జలపాతం పరిసరాల్లో పచ్చటి ఆహ్లాదకర వాతావరణం నెలకొనడంతో చిన్నా పెద్దా ఆనందంగా గడుపుతున్నారు. ఎత్తిపోతల జలపాతం పరిసరాల్లో పచ్చటి ఆహ్లాదకర వాతావరణం నెలకొనడంతో పెద్దలు, చిన్నారులు, యువత జలపాత అందాలను వీక్షిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. జల కళతో పర్యాటక తాకిడితో పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఎత్తిపోతల వద్ద వాతావరణం ఆకట్టుకుంటుందని పర్యాటకు తెలుపుతున్నారు. కనీస సౌకర్యాలు అందిస్తే బాగుంటుందని దూర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.