ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1లో 250కోట్ల కుంభకోణం: టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్రణవ్​ గోపాల్​ - TNSF Pranav Gopal Complaint - TNSF PRANAV GOPAL COMPLAINT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 2, 2024, 10:56 AM IST

TNSF State President Pranav Gopal Complaint Against YCP Goverment : గ్రూప్​-1 పరీక్షల్లో కుంభ కోణానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మూడో పట్టణ సీఐకి  టీఎన్​ఎస్​ఎఫ్ (TNSF)​ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్​ ఫిర్యాదు చేశారు. సీఎం జగన్​ మోహన్​ రెడ్డి, ఏపీపీఎస్సీ ఛైర్మన్​ గౌతం సవాంగ్​, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డిల పేర్లును ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2018లో నిర్వహించిన గ్రూప్​ 1లో రూ.250 కోట్లు కుంభకోణం జరిగిందని ప్రణవ్​ గోపాల్​ ఆరోపించారు.

Visakha District :  జగన్హయాంలో ఏపీపీఎస్సీని వైఎస్సార్​పీఎస్సీగా మార్చుకున్నారని ప్రణవ్​ కుమార్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో లక్షలాది మంది నిరుద్యోగ యువత గుండె కోతను మిగిల్చారని మండిపడ్డారు. సీఎం జగన్​ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని వ్యాఖ్యానించారు. 2018లో నిర్వహించిన గ్రూప్​ 1కు సంబంధించి జరిగిన కుంభకోణంలో వైసీపీ ప్రభుత్వంపై సీబీఐ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా డిమాండ్​ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.