జగన్‌పై ఎస్పీకి ఫిర్యాదు - రూ.6.67కోట్లు దుర్వినియోగం చేశారని వెల్లడి - TNSF Complain to SP Against Jagan - TNSF COMPLAIN TO SP AGAINST JAGAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 19, 2024, 2:58 PM IST
TNSF leaders Complain to SP Against YSRCP Chief Jagan: ప్రజాధనాన్ని సొంత అవసరాలకు వాడుకున్నాడంటూ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహనరెడ్డిపై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రాజశేఖరరెడ్డి, తదితరులు పల్నాడు జిల్లా ఎస్పీ మలికగర్గ్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం హోదాలో ఉన్నప్పుడు 6 కోట్ల 67 లక్షల ప్రజాధనాన్ని సొంత అవసరాలకు దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాడేపల్లిలో దక్షిణం వైపు వ్యూ కట్టర్ నిర్మించడానికి 0.148 ఎకరాల భూ సేకరణ కోసం రూ. 3.25 కోట్లు ఖర్చు చేశారని, అవి తిరిగి రాబట్టాలన్నారు.
క్యాంప్ కార్యాలయం కోసం అల్యూమినియం డోర్లు, కిటికీల కోసం రూ.73 లక్షలు, క్యాంప్ ఆఫీ సుకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రో మెకానికల్ పనుల నిమిత్తం రూ.18.30 లక్షలు, ఫర్నిచర్ కోసం రూ.30 లక్షలు, తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో హెలిప్యాడ్ అప్రోచ్‌రోడ్డు తదితర పనుల కోసం రూ.1.8కోట్లు, ప్రూప్ గోడలు, మొబైల్ టాయిలెట్లు, కూలర్ల కోసం రూ.22.50 లక్షలు ఇలా మొత్తం మీద రూ.6.67 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే విచారణ జరిపి జగన్‌ను అతనికి సహకరించిన అధికారులపై కేసు నమోదు చేయాలని వినతిపత్రం అందజేశారు.