జులైలో తిరుమల శ్రీవారిని ఎంతమంది భక్తులు దర్శించుకున్నారో తెలుసా - TTD Dial Your EO Program - TTD DIAL YOUR EO PROGRAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 2, 2024, 1:39 PM IST
TTD Dial Your EO Program : తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదాల్లో నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించామని ఈవో శ్యామలరావు తెలిపారు. దళారీ వ్యవస్థ నిరోధకానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు. జులైలో 22 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని ఈవో చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవాణి దర్శన టికెట్లను పరిమితం చేశామన్నారు.
అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో మాట్లాడుతూ ఇంతకు ముందు చెప్పినట్లుగా అన్న ప్రసాదాల నాణ్యత పెంచినట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి అన్నప్రసాదాన్ని భక్తులకు మరింత రుచిగా, శుచిగా అందించేందుకు టీటీడీ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ఆధునీకరించాలని నిర్ణయించినట్లే పనులు కొనసాగుతున్నాయన్నారు. గత ఐదేళ్లలో భక్తుల నుంచి వచ్చిన విమర్శలు పునరావృతం కాకుండా పూర్తిస్థాయి ప్రక్షాళనకు టీటీడీ ప్రస్తుత ఈవో (EO) శ్యామలరావు కార్యాచరణ సిద్ధం చేశామని గతంలోనే తెలిపారు.